TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీ స్టాల్స్ పెట్టి రాణిస్తున్న అమ్మాయిలు!

Published on: Wed Oct 9, 2024 12:53PM

యే చాయ్.. చటుక్కున తాగరా భాయ్.. అంటూ ఈ అందమైన యువతులు నిర్వహిస్తున్న టీ స్టాళ్ళకు కుర్రాళ్ళు క్యూ కడుతున్నారు. గ్రాడ్యుయేషన్ చదివిన  యువతులు ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తూ చాయ్ స్టాల్స్ పెడుతూ రాణిస్తున్నారు. లక్షలు సంపాదిస్తున్నారు. చాయ్ వాలాని ప్రధానమంత్రిని చేసిన మన దేశం గ్రాడ్యుయేట్లను చాయ్ వాలాలను  చేస్తోంది. అయినా పర్లేదు.. ఈ చాయ్ వాలాలు... సారీ... చాయ్ వాలీలు నిజంగానే అద్భుతాలు సృష్టిస్తున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళకంటే ఎక్కువే సంపాదిస్తున్నారు. ప్రియాంక గుప్తా అనే యువతి ‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ’ పేరుతో టీ స్టాల్ పెట్టి సక్సెస్ అయింది. అలాగే ‘ఎంఏ ఇంగ్లీష్ చాయ్ వాలీ’ పేరుతో టుక్ టుకీ దాస్, ‘బీటెక్ చాయ్ వాలీ’ పేరుతో వర్తికా సింగ్,  ‘పీజీ చాయ్ వాలీ’ పేరుతో రాధా యాదవ్, ‘నర్సింగ్ చాయ్ వాలీ’ పేరుతో ప్రీతీ ఝా, ‘బీటీసీ’ చాయ్ వాలీ పేరుతో సృష్టి వర్మ.. ఇలా చాలా మంది యువతులు తాము చదివిన చదువు పేర్లతో, తమ పెద్దల పేర్లతో టీ స్టాళ్ళు స్థాపించి విజయాలు సాధిస్తున్నారు.